* ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బిహార్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌ను ప్రభుత్వం నియమించింది. సీఎస్ రేసులో మరో ముగ్గురు అధికారులు ఉన్నప్పటికీ వారంతా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఆదిత్యనాథ్ దాస్‌వైపే సీఎం జగన్ మొగ్గు చూపారు. ఉద్యోగ విరమణ అనంతరం సీఎస్ నీలం సాహ్నిని సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పు జరిగింది. ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా నియమితులైన నేపథ్యంలో జలవనరులశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారిన ఐఏఎస్ అధికారిని వై.శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా, కె. సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. సీఎస్‌గా ఆదిత్యనాథ్ ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు.
* తిరుమల తిరుపతి దేవస్థానంలో పాము హల్చల్ చేసింది శ్రీ వారి ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది ఆ పాముని పట్టుకునీ అటవీ ప్రాంతంలో వదిలేశారు, తదుపరి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
* డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి…ప్రతి వైరస్ లో కొత్త కోణాలు ఉంటూనే వస్తుంటాయి. యూకే కొత్త వైరస్ లో మరణాలు ఎక్కువగా లేవు.* వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కానీ తీవ్రత ఉండదు.* విదేశాల నుంచి వచ్చిన వారికి కొరొనా పాజిటివ్ వచ్చినా అది కొత్తదా? పాతదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.* ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం కొరొనా కట్టడిలో విజయం సాధించాం.* ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే టెస్టులు చేయించుకోవాలి.* ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.* ఇప్పటి వరకు ఇస్తున్న ట్రీట్మెంట్ కొత్త వైరస్ కి అదే ట్రీట్మెంట్ ఇస్తారు.
* డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలంగాణ శ్రీనివాస్… కొరొనా కొత్త రకం వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….కానీ ఆందోళన అవసరం లేదు.* రాబోయే సంక్రాంతి- క్రిస్మస్ వేడుకల్లో జాగ్రత్తగా ఉండాలి.* యూకే లో కొత్తరకం వైరస్ పై కేంద్రవైద్య శాఖ ఆదేశాల మేరకు అలర్ట్ అయ్యాము.* హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అన్ని వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది.* గడిచిన నెల రోజుల్లో 300 మంది ఉన్నారు..* గడిచిన వారం రోజుల నుంచి 25నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రయాణికులను సర్వేలిన్స్ లో పెడతాం* 04024651119 డైరెక్టర్ ఆఫ్ హెల్త్ …హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాము.* విదేశాల నుంచి వచ్చిన అందరూ మాకు సహకరించాలి.* నిన్న యూకే నుంచి 7గురు వచ్చారు అందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసాము నెగిటివ్ వచ్చింది.* రెగులర్ వైరస్ కంటే కొత్త వైరస్ వ్యాప్తి 70శాతం ఉంది.* రెగులర్ వైరస్ 30శాతం ఉంటే కొత్త వైరస్ 70శాతం ఉంటుంది.
* కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్లాట్‌ఫామ్ ఉన్న స్టేషన్‌గా రికార్డులకెక్కనుంది. 1505 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని యంగ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన స్పిట్‌నాట్ ఓకే కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. హుబ్లి స్టేషన్ ఫ్లాట్‌ఫామ్ పొడవు ఒకప్పుడు 550 మీటర్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు 1505 మీటర్ల మేర నిర్మించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వే నిర్ణయించిందని ఆయన తెలిపారు. రూ.90 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది జనవరి చివరినాటికి పూర్తయ్యే అవకాశం ఉందని జోషి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ఫ్లాట్‌ఫామ్ రికార్డు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ రైల్వేస్టేషన్ పేరిట ఉంది. ఆ ఫ్లాట్‌ఫామ్ పొడవు 1366 మీటర్లు.
* బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ప్రభావం ఇప్పటికైతే మనదేశంలో లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త వైరస్ ప్రభావంపై విశ్లేషణ జరుగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తెలిపింది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.
* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు దోచేందుకు సీఎం జగన్ ప్రణాళికలు వేస్తు్న్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. చుక్కల, అసైన్డ్, సొసైటీ.. ఇలా 6 రకాల భూములపై ఆయన కన్నుపడిందన్నారు. అందుకే హడావుడిగా భూముల రీసర్వే ప్రారంభించారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల తెదేపా ఇన్‌ఛార్జ్‌లు, సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఏరోజుకారోజు భూములను సరిచూసుకునే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. జగన్ అండగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోందని ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలోనూ రూ.వందలకోట్ల భూకుంభకోణాలు జరిగాయన్నారు. వైకాపా పాలనలో అన్నివర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అజెండా మొత్తం ప్రజల్ని వేధించడం, దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించడమేనని ఆక్షేపించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 402 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,79,339కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,082 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 412 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,68,279కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,978 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,13,57,530 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
* కరోనా వ్యాప్తి కారణంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంశం కాస్త తెరమరుగయ్యిందని.. దేశంలో టీకా పంపిణీ మొదలు కాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా భాజపా అధినేత జేపీ నడ్డా కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలని షా విరుచుకుపడ్డారు.
* రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టిస్తూ గ్రామ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని నేతలు ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నా రెడ్డి, వి.హనుమంతరావు పాల్గొన్నారు. కమీషన్ల కోసం తప్ప ప్రజల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టి వారిపై కేసులు పెడుతూ సీఎం కేసీఆర్ నీచరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చిందంటే.. రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే స్థితికి చేరుకున్నట్లు భావించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లను ప్రభుత్వం వేధిస్తూ సస్పెండ్ చేస్తుందని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని నేతుల డిమాండ్ చేశారు.
* అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం(ఏఎంయూ) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. విశ్వవిద్యాలయ ఘన చరిత్రను కొనియాడారు. ఏఎంయూ పూర్వ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రశంసించారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరులో విశ్వవిద్యాలయం అపూర్వమైన సహకారాన్ని అందించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
* యూకేలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు వైద్య, విద్య సంచాలకులు డా.రమేశ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త రకం వైరస్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలు సూచనలు చేసిందన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తం అయ్యారని శ్రీనివాస్ వెల్లడించారు.
* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టిస్తూ గ్రామ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని నేతలు ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నా రెడ్డి, వి.హనుమంతరావు పాల్గొన్నారు.
* కరోనా ధాటికి వణికిపోతోన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం దాదాపు రూ.66లక్షల కోట్ల (900బిలియన్ డాలర్ల) ఉద్దీపన ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. కొవిడ్ విజృంభణతో అతలాకుతలమవుతోన్న అమెరికా సంస్థలు, పౌరులకు వివిధ రూపాల్లో ఈ ప్యాకేజీ కింద ఆర్థిక భరోసాను కలిగించనున్నట్లు అమెరికా ఉభయసభలు వెల్లడించాయి. వీటితో పాటు కరోనా వ్యాక్సిన్‌కు కావాల్సిన నిధులను కూడా ఇందులో నుంచే ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
* కేరళలో 28ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీ హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో వారిని దోషులుగా ప్రకటించింది. ఈ నెల 23న దోషులకు శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. 1992 మార్చి 27న సిస్టర్ అభయ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా.. 28ఏళ్ల తర్వాత తీర్పు వెలువడటం గమనార్హం. కొట్టాయంలోని బీసీఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్కడే హాస్టల్‌లో ఉండేది.
* బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో సోమవారం నాటి సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు.. మంగళవారం కోలుకున్నాయి. క్రితం సెషన్ భయాలతో ఈ ఉదయం హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయి. ఐటీ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల అండతో లాభాల్లో స్థిరపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి 453 పాయింట్లు ఎగబాకి 46,006 వద్ద స్థిరపడింది. ఇక 13,373 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఒకదశలో 13,244 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత చాలాసేపు ఊగిసలాడిన సూచీ చివరకు 138 పాయింట్లు లాభపడి 13,466 వద్ద ముగిసింది.
* అడిలైడ్‌లో టీమ్‌ఇండియా నమోదు చేసిన అత్యల్ప టెస్టు స్కోరును మర్చిపోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36/9కే పరిమితమై సుదీర్ఘ ఫార్మాట్‌లో చెత్త ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఓ స్థానిక వార్తా సంస్థతో మాట్లాడిన స్మిత్ ఈ విధంగా అన్నాడు. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ముందుకు సాగాలంటే వాటిని గురించి మర్చిపోవాలన్నాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని, అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతుంటాయని అన్నాడు.