2020-21 వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులుంటాయి.
ఎంతో కాలంగా వస్తో్న మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులకు భిన్నంగా నాలుగు సంవత్సరాల హానర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు.
బీఏ , బీఎస్‌సీ, బీకాం కోర్సులలో మూడు సంవత్సరాల తరువాత విధంగా పది నెలల పాటు ఇంటర్నషిప్ ను అమలు చేస్తారు.
ఈ విధంగా ఇంటర్నషిప్ పూర్తి చేసిన వారికి హానర్స్ డిగ్రీలు అంద జే్స్తారు.
మూడు సంవత్సరాల కోర్సు తరువాత ఇంటర్న్‌షిప్ వద్దనుకునే విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను జారీ జేస్తారు.
విశ్వవిద్యాలయు అనుబంధంగా నడుస్తోన్న డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వ ఉత్తరువులు వర్తిస్తాయి..