ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కారణంగా పెళ్లిల్లపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. 500-1000 మంది హాజరయ్యే పెళ్లి వేడుకలు ప్రస్తుతం 50-100 మంది అతిథిలతో ముగించేస్తున్నారు. అది కుదరకపోతే జూమ్‌లో వివాహ తంతు కానిచ్చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ నిబంధనలను పాటిస్తూ.. కేవలం సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానిస్తుండగా.. ఓ బడా బాబు మాత్రం ఏకంగా తన కుమారుడి వివాహానికి 10 వేల మంది అతిథిలను ఆహ్వానించాడు. 100-200 మందినే కంట్రోల్ చేయడం కష్టం అంటే ఈ పెళ్లికి వచ్చిన 10 వేల మంది కోవిడ్ నియమాలు పాటిస్తూ.. ఎంతో జాగ్రత్తగా వేడుకలో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ భారీ వివాహ వేడకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదేలా సాధ్యం అనుకుంటే సదరు దంపతులు డ్రైవ్ థ్రూ వివాహం చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.
మలేషియాలో మ్యారేజీ…10వేల మంది అతిథులు…ఒక స్పెషాలిటీ!
Related tags :