* తాడిపత్రిలో దివాకర్ రెడ్డి ఇంటి సమీపంలో మోహరించిన జెసి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు.పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డ ఇరువర్గాలు.పోలీసుల లాఠీఛార్జ్ ను లెక్క చేయని రెండు వర్గాలు.ఆందోళనలో పలు వాహనాలు ధ్వంసం.హైదరాబాద్ నుంచి తాడిపత్రి బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి.సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలొచ్చాయని కేతిరెడ్డి ఆగ్రహం.
* తాడిపత్రి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఇప్పటి నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు.ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు.ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.30 పోలీసు యాక్టు కూడా అమల్లో ఉంటుందన్నారు.శాంతి భద్రతల దృష్ట్యా ప్రత్యేక భద్రతా బలగాలను తాడిపత్రిలో మొహరింపజేశామన్నారు.గ్రామీణ ప్రాంతాల నుండీ అనవసరంగా పట్టణానికి వచ్చి గ్రూపుల్లో చేరిపోవడం చేయరాదన్నారు.తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాలలో సి.సి కేమేరాలు, డ్రోన్ ల ద్వారా నిఘా ఉంచామన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరిస్తే ఎవర్నీ ఉపేంక్షించబోమని స్పష్టం చేశారు.
* భువనగిరి పట్టణ శివారులో హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై కలెక్టర్ కార్యాలయం ఎదుట మొక్కలు నీళ్లు పోయాడానికి ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్ ను ఢీ కొట్టిన కారు నలుగురు అక్కడికక్కడే మృతి.
* రాజమండ్రిలో కొత్త కరోనా వైరస్??ఊఖ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ, కరోనా పరీక్షా ఫలితాలు రాకముందే ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ నుంచి నుంచి తప్పించుకొని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రికి చేరుకుంది.సదరు మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఢిల్లీ అధికారుల సమాచారం మేరకు ఆ మహిళతో పాటుగా ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానిక అధికారులు.
* గుంటూరు జిల్లా వినుకొండ…నిన్న రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి అక్రమంగా ఏఎన్ఎం పార్సిల్ లో ఖైనీ గుట్కా తరలిస్తున్నారని సమాచారం మేరకు వినుకొండ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ. కే శ్రీనివాస్ బస్టాండ్ వద్ద సోదాలు చేయగా సుమారు 10 లక్షల రూపాయల సరుకు పట్టుకొన్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ. కే శ్రీనివాస్