తానా ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కర్నూలు నగరంలోని రహదారుల పక్కన నిద్రిస్తున్న అభాగ్యులకు డిఎస్పీ కే. వి. మహేష్, డిఎస్పీ మహేష్ రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీలు కే. వి. మహేష్, మహేష్ రెడ్డిలు తానాను అభినందించారు. కార్యక్రమ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ చలిలో చిన్నారులు, మహిళలు, వృద్దులు నిద్రిస్తున్న దీనస్థితిని తానా కార్యదర్శి రవి పొట్లూరి దృష్టికి తీసుకురావడటంతో ఆయన స్పందించి ఈ వితరణకు ఆర్థిక చేయూత అందించారని పేర్కొన్నారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మీనాక్షి, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.
అభాగ్యులకు పొట్లూరి రవి ఆసరా!
Related tags :