అగ్రహీరోలతో సినిమాలు చేయలేదనే అసంతృప్తి తనలో లేదని అంటోంది లావణ్య త్రిపాఠి. స్టార్స్‌తో మాత్రమే నటించాలనే పరిమితులు విధించుకుంటే కెరీర్లో ముందుకు సాగలేమని చెబుతోంది. సినిమాల పరంగా తన ఆలోచనల్ని గురించి లావణ్య త్రిపాఠి వెల్లడిస్తూ ‘కొత్తదనంతో పాటు మంచి పాత్ర చేశాననే అనుభూతి ప్రతి సినిమాలో ఉండాలి. సహజత్వంతో కూడిన పాత్రల్లోనే నన్ను ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. అలాంటి కథలకే మొదటి ప్రాధాన్యమిస్తా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంకితభావంతో పాత్రకు న్యాయం చేయడానికి శ్రమిస్తా. అదే నా విజయరహస్యమని నమ్ముతా. కాలానుగుణంగా చిత్రసీమలో ట్రెండ్స్ మారడం సహజం. కానీ నేనెప్పుడూ వాటిని ఫాలో అవ్వను. కథ నా మనసుకు నచ్చితే ఫలితం గురించి ఆలోచించకుండా ఆ సినిమాలో భాగమవుతా. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదనే భావన నాలో ఎప్పుడూ లేదు. సినీ పరిశ్రమలో విజయమే ముఖ్యం. స్టార్స్‌తో సినిమాలు చేయలేకపోయినా నా కెరీర్లో ఎన్నో మంచి విజయాలున్నాయి. ఆ సిద్ధాంతాన్ని నమ్మే ముందుకు సాగుతున్నా’ అని తెలిపింది.
నాకు అసంతృప్తిగా లేదు

Related tags :