పేదలకు ప్రభుత్వం నిర్మించే ఇళ్లను సీఎం వైఎస్ జగన్ ఇంటి బాత్‌రూమ్‌తో పోల్చిన లోకేశ్.. ఎప్పుడైనా ఆ బాత్‌రూమ్‌ను కడిగాడా? అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పేదలకు నిర్మించే ఇంటి ని బాత్‌రూమ్‌తో పోల్చటంతో పేదలంటే లోకేశ్‌కు ఎంత చులకనో అర్ధమవుతోందన్నారు. గుడ్లవల్లేరులో శనివారం ఇళ్ల పట్టాలను అందించి, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మంత్రి కొడాలితోపాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. ఎవరి బాత్‌రూమ్ ఎంత ఉందో కొలిచే దుస్థితిలో బాబు, లోకేశ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. పేదలపై అంత కడుపు మంట ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్‌లో ఒక్కో ఇంటి వైశాల్యం 244 చదరపు అడుగులుంటే, జగన్ ఇచ్చే ఇంటి వైశాల్యం 340 చదరపు అడుగులుందన్నారు.
లోకేశ్…జగన్ బాత్‌రూమ్ కడిగావా? – [Video]
Related tags :