మన చుట్టూ ఉండే వారిలో, తెలిసినవారిలో ఎవరో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారనే వార్తలను మనం నిత్యం వింటున్నాం. అయినప్పటికీ ఈ వ్యాధి వచ్చేందుకుగల కారణాలను మాత్రం మనం పూర్తిస్థాయిలో అన్వేషించ లేకపోతున్నాం. దీని గురించి తెలియాలంటే నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోయినా క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. – నిత్యం ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు. – నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్ల శరీరం వాపులకు గురవుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బ తిని, ఆ భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రోజూ సరైన సమయానికి తగినన్ని గంటల పాటు నిద్రించాలి. -ఎక్కువసేపు కూర్చుని ఉండడం అనారోగ్యాలకు మూలం. చాలా మంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొంటున్నారు. దీనివల్ల డయాబెటిస్, హైబీపీ బారిన పడుతున్నారు. ఇలాంటి వారు రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆయా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడమే కాదు, క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు.
ఫైబర్ తీసుకో…క్యాన్సర్ దూరం చేసుకో
Related tags :