Movies

సోనుకు మరో మంచి గౌరవం

Sonu Sood Awarded Person Of The Year

లాక్ డౌన్ స‌మ‌యంలో వేలాదిమందికి అండ‌గా నిలిచి రియ‌ల్‌హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్. లాక్‌డౌన్ తో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న వేలాదిమందిని సొంత డ‌బ్బుల‌తో వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించాడు. రీల్‌లైఫ్ లో విల‌న్ గా క‌నిపించిన సోనూసూద్ గొప్ప‌మ‌న‌సుకు అంద‌రూ సెల్యూట్ చేశారు. త‌న చిన్న‌నాటి ఫ్రెండ్ నీతిగోయెల్ తో క‌లిసి ఘ‌ర్ భేజో క్యాంపెయిన్ ను షురూ చేసి 7.5ల‌క్ష‌ల‌కు పైగా వ‌ల‌స కార్మికుల‌కు ర‌వాణా, ఆహారం, మెడిక‌ల్‌, ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించి..సుర‌క్షితంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాడు. 2020లో క‌రోనా ప‌రిస్థితుల్లో గొప్ప హృద‌యంతో స్పందించిన సోనూసూద్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయర్-2020గా నిలిచాడు. క‌రోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సోనూసూద్ అందించిన సేవ‌ల‌కు ఆయ‌న‌ను యూఎన్డీపీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుతో స‌త్క‌రించింది.