* విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు…2018తో పోల్చితే 15 శాతం, 2019తో పోల్చితే 12 శాతం కేసుల సంఖ్య తగ్గింది.కోవిడ్ కేసులు మినహాయించి మొత్తం 3568 కోవిడ్ కేసులు నమోదు చేశాం.చోరీలకు సంబంధించి 78.77 శాతం కేసులలో చోరీసొత్తును రికవరీ చేయగలిగాం.సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 36 శాతం రికవరీ చేయగలిగాం.మహిళలపై నేరాల సంఖ్య గత రెండేళ్లలో పోల్చితే గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోల్చితే 11.19 శాతం కేసులు తగ్గాయి.ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుల విచారణ.కోర్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేస్తున్నాం. 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్ష పడింది.
* రాత్రి నాటుసారా సేవించిన 25 మందికి అస్వస్థత.ఇద్దరి పరిస్థితి విషమం, శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలింపు.స్థానిక వైద్యుడి వద్ద చికిత్సపొందిన మిగతా 23 మంది బాధితులు.సోంపేట మం. సిరిమామిడిలో ఘటన.
* దేశంలో మరోసారి 20వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా 18,732 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 1లక్షా 87వేల 850కి పెరిగింది.
* కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు.
* దాడి చేసిన వారిని వదిలి.. బాధితులపై హత్యాయత్నం కేసులా?జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వదిలేసి.. జేసీపై హత్యాయత్నం కేసు నమోదు చేయటాన్ని తెదేపా నేతలు ఖండించారు.