30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అనర్హులకు పట్టాలు ఇచ్చారంటూ ప్రజలేకాదు, సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసనలు ఎదురవుతున్నాయి. పొందుగలలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇళ్ల పట్టాలు రాలేదంటూ స్థానిక వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు.. వైసీసీ జెండాలు, క్యాలెడర్లను తగులబెట్టి నిరసన తెలిపారు.. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పంపిణీ చేసిన గడియారాలను పగలగొట్టారు. ఓట్ల కోసం నాయకులు తమ ఇళ్లకు ఎలా వస్తారో చూస్తామని వైసీపీ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు.
మైలవరం వైకాపా కార్యాలయంపై దాడి
Related tags :