* ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పారిశ్రామికవాడలో విజయ్ లూబ్రికెంట్స్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.దీంతో అక్కడ ఏం జరుగుతుందో అని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.సదరు కంపెనీ లో భారీగా ఆయిల్ తో కూడుకున్న చమురు ఉత్పత్తులు ఉన్నాయి.భారీ ఎత్తున పీపాలలో ఉన్న ఉత్పత్తులకు మంటలు వ్యాపించినట్లు అయితే ఇక్కడ ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇతర కంపెనీల యజమానులు పేర్కొన్నారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నప్పటికీ మంటలు అదుపు కావటంలేదు.దీంతో చుట్టుపక్కల ఉన్న కెమికల్ కంపెనీలలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.
* రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లి సమీపంలో ఓ ఫాం హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విత్తన డీలర్ల కోసం ఎరువుల కంపెనీక చెందిన ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి ఈరేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 6 మంది యువతులతో పాటు మరోక 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కీసర సీఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు, వీరిని కోర్టులో హజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
* జి.మాడుగుల తహసీల్దార్ కార్యాలయం జప్తునకు కోర్టు ఆదేశం.విశాఖ జిల్లా వి.మాడుగుల తహసీల్దార్ కార్యాలయ భవనం జప్తునకు చోడవరం కోర్టు ఆదేశించింది.ఇళ్ల స్థలాలకు పరిహారం చెల్లించకపోవడంతో కోర్టు జప్తు నోటీసు ఇచ్చింది.
* విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది.ఆ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.మరింత లోతైన విచారణ జరపాలని సీబీఐకి ఆదేశించింది.
* నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో అర్థరాత్రి మార్చురీ వద్ద గుర్తు తెలియని మహిళ రక్తపు మడుగులో మృతిచెందింది.మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.