గాడిద పాలకు మార్కెట్ల్లో మంచి గిరాకీ ఉంది. ఆ పాల విక్రయంతో సరిహద్దులు దాటుకుని మరీ కొందరు జీవనం సాగిస్తున్నారు. అనంతరపురం జిల్లా కల్యాణదుర్గంలో దాదాపు 30 మంది గాడిదపాలు అమ్ముతూ కంటపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన 30 మంది వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ జీవనం సాగిస్తున్నారు. గాడిదపాలు అమ్ముకుంటూ రోజుకు రూ.1000 నుంచి రూ.2000వరకు సంపాదిస్తున్నారు. 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలను సుమారు రూ.100లకు అమ్ముతున్నారు. ఇది చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులను దూరం చేసే శక్తి గాడిద పాలకు ఉందని వారు చెబుతున్నారు.
నిజామాబాద్‌లో గాడిదపాల వ్యాపారం. రోజుకి ₹2000 ఆదాయం.
Related tags :