ScienceAndTech

పాస్‌పోర్టు రంగుల వెనుక ఒక కథ ఉంది

పాస్‌పోర్టు రంగుల వెనుక ఒక కథ ఉంది

మన దేశ పాస్‌పోర్ట్ చూశారు కదా..! నీలం రంగులో ఉంటుంది. మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల పాస్‌పోర్టులు ఒకే రంగులో ఉండవు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు వంటి విభిన్న రంగుల్లో కనిపిస్తాయి. దీనికి బలమైన కారణమే ఉంది. అవేంటో మీరే చూడండి.
*మన దేశ పాస్‌పోర్ట్ చూశారు కదా..! నీలం రంగులో ఉంటుంది. మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల పాస్‌పోర్టులు ఒకే రంగులో ఉండవు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు వంటి విభిన్న రంగుల్లో కనిపిస్తాయి. దీనికి బలమైన కారణమే ఉంది.
**సాధారణ పౌరులకు ఇచ్చే పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, దౌత్యవేత్తలకు ఇచ్చే పాస్‌పోర్టులు వేరే రంగుల్లో ఉంటాయి.వందలాది రంగులు ఉన్నా అన్ని దేశాల పాస్‌పోర్టులు ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నలుపు వంటి ప్రామాణిక రంగుల్లోనే ఉంటాయి. ఐతే కెనడా తాత్కాలిక పాస్‌పోర్టు మాత్రం తెలుపు రంగులో ఉంటుంది.
*ఎరుపు రంగు
చాలా వరకు దేశాల పాస్‌పోర్ట్ ఎరుపు రంగులోనే ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ దేశాలైన చైనా, రష్యా, సెర్బియా, పోలాండ్, జార్జియా వంటి దేశాలు పౌరులకు ఎరుపు రంగు పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తాయి. క్రొయేషియా మినహా మిగత ఈయూ దేశాల పాస్‌పోర్ట్‌లు కూడా ఎరుపు రంగు షేడ్‌లోనే ఉంటాయి. అటు కొలంబియా, బొలీవియా, ఈక్వెడార్, పెరూ పాస్‌పోర్టుల రంగు సైతం ఎరుపే.
*నీలి రంగు
కొత్త ప్రపంచానికి ప్రతీక..నీలిరంగు. 15 కరీబియన్ దేశాల పాస్‌పోర్టులు నీలి రంగులో ఉంటాయి. దక్షిణ అమెరికాకు చెందిన మెర్కోసుర్ ట్రేడ్ యూనియన్ దేశాలు (బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే) తమ వాణిజ్య బంధానికి ప్రతీకగా పౌరులకు నీలి రంగు పాస్‌పోర్టును జారీచేస్తాయి. 1976 నుంచి అమెరికా తమ పౌరులు నీలి రంగు పాస్‌పోర్టును జారీచేస్తోంది.
*ఆకుపచ్చ రంగు
సౌదీ అరేబియా, మొరాకో, పాకిస్తాన్ వంటి ముస్లిం దేశాలు గ్రీన్‌ కలర్ పాస్‌పోర్టును కలిగి ఉన్నాయి. మహ్మద్ ప్రవక్తాకు ఆకుపచ్చరంగంటే ఇష్టమని ఆయా దేశాల నమ్మకం. ఇక పశ్చిమాఫ్రికా దేశాలైన నైజీరియా, నైజర్, ఐవరీ కోస్ట్ వంటి దేశాలు సైతం ఆకుపచ్చ పాస్‌పోర్టును కలిగి ఉన్నాయి. గ్రీన్‌ కలర్‌ను తమ వాణిజ్య బంధానికి ప్రతీకగా భావిస్తాయి.
*నలుపు రంగు
చాలా తక్కువ దేశాలు నలుపు రంగు పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. జాంబియా, అంగోలా, బురుండి, కాంగో, బోట్స్‌వానా వంటి ఆఫ్రికన్ దేశాలు ఆ లిస్టులో ఉన్నాయి. న్యూజిలాండ్ జాతీయ రంగు నలుపు కావడంతో ఆ దేశ పౌరుల పాస్‌పోర్ట్ కూడా నలుపు రంగులోనే ఉంటుంది.