Health

మూర్ఛ…శాశ్వతంగా తొలగించుకోవచ్చు

You can now get treated for seizures permanently

ఎవరికైనామూర్ఛ వ్యాధి మొదలయ్యిందీ అంటే….. వారి జీవితం ఇక అంతే అనుకునే వాళ్లు ఒకప్పుడు.ఇప్పుడు అలా లేదు. ఆధునిక చికిత్సా విధానాలు మూర్ఛ వ్యాధిని సమూలంగా తొలగించి, వాళ్లకుఅందరిలాంటి సాధారణ జీవితాన్ని అందిస్తున్నాయి. వారసత్వ మూలాలు, మెదడుసంబంధ ఇన్‌ఫెక్షన్లు, తలపైని బలమైన గాయాలు, పక్షవాతంలేదా మెదడులో కణుతులు ఏర్పడటం వంటివే ఎక్కువగా మూర్ఛ వ్యాధికి కారణమవుతూ ఉంటాయి.అలా ఏ కారణంగా మూర్ఛ సమస్య మొదలైనా ఆయా చికిత్సల ద్వారా మూర్ఛవ్యాధి నుంచిపూర్తిస్థాయిలో విముక్తం చేసే వైద్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.**మూర్ఛకుముందు…ఏదోభయం, ఆందోళన, మగతగాఉండడం లేదా అయోమయం మూర్ఛ రావడానికి ముందు కనిపించే కొన్ని లక్షణాలు. ఆ తర్వాతకళ్లు, ముఖం, మెడఒక పక్కకు తిరిగిపోతాయి. కాళ్లు బిగుసుకుపోయి, అవయవాలనువేగంగా అటూ ఇటూ ఊపేస్తుంటారు. నాలుక కొరుక్కోవడం, తెలియకుండానేమూత్రం చేయడం వంటి లక్షణాలు కూడా వెంటనే కనిపిస్తాయి.వచ్చి పోయాక మరి కొద్ది సేపుమగతగానూ, అయోమయంగానూ ఉంటారు.
*తొలిప్రయత్నంగా…
మొట్టమొదటిసారి మూర్ఛ వచ్చినప్పుడు వెంటనే రక్త పరీక్షలు చేయించాలి. ఈ పరీక్షల్లోరక్తంలోని షుగర్‌, క్యాల్షియం, సోడియంనిల్వలు తెలిసిపోతాయి. వాటిల్లో ఏదైనా అస్తవ్యస్తత కనిపిస్తే, వాటినిసహజ స్థితికి తెచ్చే ప్రయత్నాలు చేయాలి. అయితే, ఒకటిరెండు మూర్ఛలు వచ్చినంత మాత్రాన వారిపైన మూర్ఛ రోగి అనే ముద్ర వేయకూడడు. సాధారణంగా 6 మాసాల పసిపిల్లల నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. మెదడు సరిగా ఎదగనిపిల్లల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి పిల్లలకు ఏకంగా మూర్ఛ వ్యాధిమందులు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధపడిపోకూడదు. కాకపోతే తరుచూ మూర్ఛలు వస్తున్నప్పుడుపరిస్థితిని సమీక్షించడానికి ఇ.ఇ.జి (ఎలకో్ట్ర ఎన్‌సెఫెలోగ్రఫీ), సీ.టీవంటి బ్రెయిన్‌ స్కాన్‌లు చేయించాలి.
**వైద్యచికిత్సలు…
ఏ రకంమూర్ఛ, రోగి వయసు, స్త్రీయా, పురుషుడాఅనే అంశాల అధారంగా వైద్య చికిత్సలు ఉంటాయి. దాదాపు 70 శాతంమంది మూర్ఛ సమస్యలు మందులతోనే నయమవుతాయి. ఒకసారి వైద్య చికిత్సలు మొదలైతే 3 నుంచి 5 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మందులు వేసుకోవలసి ఉంటుంది. సమస్య తీవ్రతను అనుసరించి కొందరుజీవిత కాలమంతా మందులు వేసుకోవలసి రావచ్చు. ఇక 30 శాతంమంది రోగులకు మాత్రం మందులతో ప్రయోజనం ఉండదు. అలాంటి వారికి సర్జరీ తప్పదు. ఏమైనా, మూర్ఛవ్యాధి ఈ రోజుల్లో శాశ్వతంగా తొలగిపోని వ్యాధి ఎంతమాత్రం కాదు.