Politics

రఘురామ సరికొత్త ఫిర్యాదులు

Raghurama Raju Writes To PM Modi Over Damaging Hindu Temples

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఎంతో చరిత్ర కలిగిన రామతీర్థంలో విగ్రహాలను తాజాగా ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలపై 100కి పైగా దాడులు జరిగినట్లు ఎంపీ లేఖలో పేర్కొన్నారు.