దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు! 20 సెకండ్ల పాటు ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జ్వలించాడు. కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యుజన్ ఎనర్జీ, సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడి పేరు… కె-స్టార్ (ది కొరియా సూపర్ కండక్టింగ్ టొకమాక్ అడ్వాన్సుడ్ రీసెర్జ్). 2008లోనే తొలిసారిగా ఇది సంచలనం సృష్టించింది. అయితే- 2025 నాటికి దీన్ని కనీసం 300 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలన్నది పరిశోధకుల లక్ష్యం. ఈ దిశగా సూర్యుని మాదిరే కె-స్టార్‌లోనూ వారు జ్వలన (ఫ్యుజన్) ప్రతిస్పందనలను కలిగిస్తున్నారు. దీని కోసం వారు హైడ్రోజన్ నుంచి ప్లాస్మాను సేకరించారు. ఇందులో 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన ఆయాన్లు ఉంటాయి. ఫ్యుజన్ రియాక్టర్ సాయంతో ఆయాన్లను అధిక వేడిలో ఉంచడం ద్వారా… ప్లాస్మా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 20 సెకండ్ల పాటు కొనసాగేలా పరిశోధకులు విజయం సాధించారు. ‘‘వాణిజ్య అణు ఫ్యుజన్ రియాక్టర్లలో ప్లాస్మా ఆపరేషన్ చాలా కీలకమైనది. భవిష్యత్తులో ఈ పదార్థం అత్యంత ప్రభావవంతగా, దీర్ఘకాలం పనిచేసేలా సాంకేతికతను రూపొందించడంలో ఈ పరిశోధన దోహదపడుతుంది’’ అని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొరియా కృత్రిమ సూర్యుడు అదరగొట్టాడు
Related tags :