Movies

ఈ మధ్య బలహీనమైన భావాలు వస్తున్నాయి

ఈ మధ్య బలహీనమైన భావాలు వస్తున్నాయి

‘‘కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితులను తలచుకుంటే ఏడుపొస్తుంది. మనం అంత వీక్‌గా ఉన్నామా? అనే ప్రశ్న పుడుతుంది. నాక్కూడా ఈ మధ్య అలాంటి ఫీలింగే వచ్చింది’’ అని అన్నారు సన్నీలియోన్‌. ఇటీవల ఆమె కొన్ని వర్కవుట్లు చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చాయట. దీని గురించి ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘కాళ్లు రెండూ దూరంగా జరిపి ఈ మధ్య కొన్ని స్ట్రెచ్‌లు ప్రాక్టీస్‌ చేశాను. అలవాటు లేకుండా చేయడం వల్ల చాలా బాధగా అనిపించింది. నేను శారీరకంగా బలహీనంగా ఉన్నానా? మానసికంగా ఉన్నానా? అని ప్రశ్నించుకున్నా. కొంచెం సేపు ఆలోచించాక ఏదో సాధించాలనే పట్టుదల కలిగింది. చిరునవ్వుతో మరుసటి రోజు అదే వాయామాన్ని మొదలుపెట్టాను. కొన్నాళ్లకు నా పట్టుదలను చూసి నాకే ముచ్చటేసింది. నేను మరీ అంత వీక్‌ కాదనే నిర్ణయానికి వచ్చా. ఇప్పుడు ఆ ఎక్సర్‌సైజ్‌లను సులభంగా చేయగలుగుతున్నా’’ అని అన్నారు.