WorldWonders

ఇండియాలో మోనోలిత్

Monolith Comes To India In Ahmedabad

నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్ది రోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఇపుడు భారత్‌లోనూ కనిపించింది. వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్‌లోని ఉద్యానవనంలో ఆరడుగుల పొడవున్న లోహంతో కూడిన ఏకశిల ప్రత్యక్షమైంది. ఈ శిల భూమిలో పాతిపెట్టినట్టు ఉంది కానీ ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై ఉద్యానవన తోటమాలి ఆశారామ్‌ స్పందిస్తూ ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను క్రితంరోజు సాయంత్రం చూసినపుడు అసలు దాని ఆనవాళ్లే లేవని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందంటూ వివరించాడు. ఆ లోహ‌ శిలపై ఏవో కొన్ని అంకెలు, గుర్తులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 నగరాల్లో ఇదే తరహా ఏకశిలలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇవి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి.