Kids

బాల్యంలో సంగీతం…మంచి సంగీత దర్శకులను చేస్తుంది

బాల్యంలో సంగీతం…మంచి సంగీత దర్శకులను చేస్తుంది

పెద్ద పెద్ద సంగీతకారుల్లో దాదాపు అందరూ చిన్నవయసు నుంచే సాధన మొదలుపెట్టడం గమనిస్తూనే ఉంటాం. వాళ్లు చిన్న వయసులో సంగీతం నేర్చుకున్నారు కాబట్టే అంత పెద్ద గాయకులూ గాయనులూ కాగలిగారని స్వీడన్‌కి చెందిన కరొలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు చెబుతున్నారు. దీనికోసం వాళ్లు మూడువందలకు పైగా పేరున్న సంగీత విద్వాంసుల్ని ఎంపికచేసి, వారి గురించిన పూర్తి వివరాలను ఆరాతీశారట. చివరికి తేలిందేంటంటే… పసివయసులో మెదడులోని న్యూరాన్లు సంగీతానికి బాగా స్పందించి, నేర్చుకునేందుకు అనువుగా ఉంటాయి. దాంతో ఆసక్తి కూడా పెరుగుతుంది. పెద్దయ్యాక మొదలుపెట్టేవారితో పోల్చితే చిన్నప్పట్నుంచే సంగీతజ్ఞానం ఉన్నవారే ఎక్కువగా గొప్ప విద్వాంసులు కావడానికి కారణమదే అన్నది కరొలిన్‌స్కా పరిశోధకుల మాట. సంగీతకారుల కుటుంబంలో పుట్టిన వారికి జన్యువులతో పాటు, ఇంట్లో అదే వాతావరణం ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ ఆసక్తి ఉంటుందన్నది తెలిసిందే.