Movies

రెండో యుగానికి ఒకడు

రెండో యుగానికి ఒకడు

సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘అయిరతిళ్‌ ఒరువన్‌’. 2010లో విడులైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. తెలుగులోనూ ‘యుగానికి ఒక్కడు’గా అనువాదం అయింది. దీనికి కొనసాగింపు చిత్రం రాబోతుందని కొంత కాలంగా కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించనున్నాడు. దర్శకుడు సెల్వ రాఘవన్‌ ఈ విషయాన్ని అధికారికంగా ట్విటర్‌లో ప్రకటించారు. దీనిపై ధనుష్‌ స్పందిస్తూ… ‘సినిమా ప్రీ ప్రొడక్షన్‌కి సంవత్సర కాలం పడుతుంది. సెల్వరాఘవన్‌ తెరకెక్కిస్తున్న మా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పూర్తయేందుకు మరింత సమయం పడుతుంది. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు మా వంతు కృషి చేస్తాం’ అని బదులిచ్చారు. సినిమాను 2024లో థియేటర్లకు తీసుకురానున్నారు.