Movies

ఇది ప్రతిభావంతులకు బంగారు సమయం

ఇది ప్రతిభావంతులకు బంగారు సమయం

స్టార్‌ కథానాయికగా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న తార తమన్నా. కెరీర్‌ ప్రారంభంలో అపజయాలనే చవిచూసినా ఆ తర్వాత అగ్ర కథానాయకులందరితోనూ ఆమె ఆడి పాడారు. అయితే, టాలీవుడ్‌ వ్యక్తులే సినీపరిశ్రమలో పైచేయి సాధిస్తారనే మాట చాలా ఏళ్లుగా చర్చకొస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించింది. ‘‘ఇండస్ట్రీకి చెందినవారా? కాదా అనేది సమస్య కాదు. ప్రతిభ ఉండి నిబద్దతతో పనిచేసే ఎవరైనా ఇక్కడ విజయాలు సాధించొచ్చు. వాస్తవానికి బయటివారికి ఇది మంచి సమయం. ప్రతిభ ఆధారంగానే ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. పరిశ్రమలో ఇప్పుడున్న సూపర్‌ స్టార్లు చాలా వరకు బయటి వ్యక్తులే. నాకు గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరు. నేను ఇండస్ట్రీకి చెందినదాన్నీ కాదు. సొంత ప్రతిభతో ఎదిగాను. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది’’ అని ఆమె చెప్పింది.