DailyDose

సైబారాబాద్‌లో 3571పై కేసులు-నేరవార్తలు

సైబారాబాద్‌లో 3571పై కేసులు-నేరవార్తలు

* సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వారం రోజుల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 3,571 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబరు 27 నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే 931 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 714 కేసులు, గచ్చిబౌలీలో 709… అత్యల్పంగా బాలాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 173 కేసులను పోలీసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

* టిడిపి నేత పురం శెట్టి అంకులు కుటుంబం లో మరో విషాదం.అంకులు హత్య నేపద్యంలో మనోవేదనకు గురైన కుటుంబ సభ్యులు .మనసిక వ్యధతో కుప్పకూలిపోయిన అంకులు బామ్మర్ది శ్రీనివాస్.సృహ కోల్పోయిన కొద్దిసేపటికే మృతి చెందిన శ్రీనివాస్.దాచేపల్లి మండలం పెదగార్లపాడు లో విషాదచాయలు.

* కృష్ణా జిల్లా నందివాడ మండలం అంకన్నగూడెం లో చేపలు చెరువు ప్రాంతం లో పేకాట స్థావరం పై యస్ఈబి, లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడులు..ఈ దాడులలో నలబై రెండు లక్షల రూపాయలను నగదును పట్టుకున్న పోలీసులు…పేకాట ఆడుతున్న. ముఫ్ఫై మందిని అరెస్టు చేసిన‌ పోలీసులు..ముఫ్ఫై మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…28 కార్లు, 13 బైక్ లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…ఈ పేకటా శిబిరం ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు…పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తాం.

* పంజాగుట్ట పై వంతెన వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. పంజాగుట్ట చౌరస్తాలోని ట్రాఫిక్‌ పోలీస్‌ పైలాన్‌ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్‌ మండలం న్యాలకల్‌కు చెందిన రవి ఆర్సీపురంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మూడు రోజుల క్రితం చందానగర్‌లోని ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రి బిల్లు భారం కావడంతో ఇవాళ నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్తుండగా వారి నుంచి తప్పించుకున్నాడు. పంజాగుట్ట చౌరస్తాలోని ట్రాఫిక్‌ పైలాన్‌ ఎక్కి చొక్కాతో ఉరి వేసుకునేందుకు యత్నించాడు. గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆర్టీసీ బస్సు సాయంతో అతడిని కిందకు దించి నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

* అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఓ శుభకార్యంలో కలుషిత ఆహారం తిని 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు చిన్నారులు, ఏడుగురు పెద్దలు ఉన్నారు. బాధితులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

* మద్యం మత్తులో బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఓ వ్యక్తితోపాటు అతడి స్నేహితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింలు, అంజన్న వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు. నర్సింలు భార్యతో తగవు పడగా.. ఆమె నాలుగు రోజుల కిందట పిల్లల్ని తీసుకుని ఊరెళ్లి పోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదివారం విందు చేసుకుందామని నర్సింలు.. అంజన్నను పిలిచాడు. ఇద్దరూ మద్యం తాగారు. అంజన్న మత్తులోకి వెళ్లగా.. నర్సింలు బయటకు వెళ్లి ఏడేళ్ల బాలికను బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. తలుపులు మూసి అత్యాచారానికి యత్నించాడు. బాలిక బిగ్గరగా అరవడంతో ఇరుగు పొరుగు వారు విని ఇంటి తలుపులు బలవంతంగా తెరిచారు. అంజన్న, నర్సింలులను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

* కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగిన నలుగురు బాలురు బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం…..డిసెంబరు 31 వేడుకల్లో భాగంగా 14 నుంచి 16 ఏళ్ల వయసున్న నలుగురు బాలురు పీకల దాకా మద్యం తాగారు. అర్ధరాత్రి ఆ గ్రామంలోని ఓ వితంతువు ఇంటికి వెళ్లారు. ఆమెను భయపెట్టి ఇద్దరు కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాకుండా ఆ దురాగతాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి విషయం బయటికి చెప్పవద్దని హెచ్చరించారు. నిందితులు తమ వద్ద చిత్రాలు ఉన్నాయని భయపెట్టడంతో ఆ నిరుపేద కుటుంబం ఫిర్యాదు చేసేందుకు సాహసించలేదు. కాగా గ్రామంలో కొందరు వ్యక్తులు పంచాయితీ పెట్టి నిందితుల నుంచి పరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదిర్చినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సై కృష్ణయ్యను సంప్రదించగా అత్యాచారంపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.