టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఎల్లుండి (జనవరి 6న) ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తొమ్మిది మంది సీనియర్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు సమావేశమై గుంగూలీ ఆరోగ్య పరిస్థితిపై చర్చించింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ వాయిదా వేయడమే సురక్షితమని బోర్డు సభ్యులు భావించినట్టు ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రూపాలీ బసు వెల్లడించారు. ఈ బోర్డు సమావేశంలో ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ దేవి శెట్టి, కేఆర్ పాండా వర్చువల్ వేదికగా హాజరయ్యారని, అమెరికా నుంచి మరో వైద్య నిపుణుడు కూడా ఫోన్‌లో పాల్గొన్నారని వెల్లడించారు.
ఇంటికి వస్తున్న గంగూలీ
Related tags :