జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీ కి చెందిన 9 మంది పేద విద్యార్థులు అనిత, భవాని, ప్రవల్లిక, లక్ష్మీకాంత శెట్టి, షబ్బీర్, చంద్ర, షబానా, పరశురాముడు, రామిరెడ్డిలకు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ₹45000 రూపాయల ఉపకారవేతనాలను మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ ద్వారా తానా కార్య్దర్శి పొట్లూరి రవి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాణిక్యం రవి, ముప్పా రాజశేఖర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు రత్న కుమారి, వడ్డేపల్లి సూరి, హోటల్ విజయ్, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా పేద విద్యార్థులకు చేయూత
Related tags :