Agriculture

విదేశీ పండ్లు భారీగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా

విదేశీ పండ్లు భారీగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా

అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్‌ కివి, వాషింగ్టన్‌ యాపిల్, కాలిఫోర్నియ ద్రాక్ష, ఆ్రస్టేలియా ఆరెంజ్, థాయిలాండ్‌ డ్రాగన్‌.. ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర పండ్ల మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కరోనా కాలంలో విదేశీ పండ్ల వినియోగం గణనీయంగా పెరిగిందని మార్కెట్‌ వర్గాల అంచనా. ప్రతి పండు పోషకాల సమ్మేళనం. సీజన్‌లో వచ్చే పండ్లలను తింటే మేలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల పండ్లు రోగాలను సైతం నయం చేస్తాయని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు.
*ఇటీవలి కాలంలో నగరంలో విదేశీ పండ్ల దిగుమతులు భారీగా పెరిగాయని గడ్డిఅన్నారం మార్కెట్‌ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్‌లో రోజుకు దాదాపు 50–60 టన్నుల విదేశీ పండ్ల విక్రయాలు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే విదేశీ పండ్ల విక్రయాలు పెరిగాయని వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి.
*గతంలో కేవలం సంపన్నులకే అందుబాటులో ఉండే ఈ పండ్లు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజల దరికి చేరాయి. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ పోషక విలువలు మెండుగా ఉండే పండ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నందున.. ఈ ఫ్రూట్స్‌ తినేందుకు మొగ్గు చూపుతున్నారు.
*గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు 20 దేశాల నుంచి వివిధ రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. నగరంలో ఇటీవల ఈ పండ్ల వాడకం గణనీయంగా పెరగడంతో విదేశీ పండ్ల స్వీకరణలో మన నగరం దేశంలోనే మూడో స్థానానికి చేరుకుంది.
*ముంబై, బెంగళూరు తర్వాతి స్థానం హైదరాబాద్‌ది అని ‘వాషింగ్టన్‌ యాపిల్‌ కమిషన్‌’ డేటాలో తేలిందని విదేశీ ఎగుమతి, దిగుమతుల నిపుణుడు పి.రాకేశ్‌రెడ్టి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో లభించే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్‌లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
***ఏ పండు ఎక్కడ నుంచంటే..
*యాపిల్‌: గ్రీన్‌ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి నెలకు దాదాపు 12 వేల పెట్టెలు దిగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి యాపిల్‌ వాషింగ్టన్, రాయల్‌ గాల, యాపిల్‌ చైనా.. ఇక్కడి నుంచే గాకుండా న్యూజిలాండ్‌ నుంచి చిల్లి, బెల్జియం నుంచి కూడా పండ్లు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి.
*డ్రాగన్‌ఫ్రూట్‌
క్యాబేజీ రూపంలో గులాబీ రంగులో ఉండే ఈ పండుకు పైన తొన ఉంటుంది. లోపల ఎక్కువగా తెలుపు కొన్ని ఎరుపు రంగులో కనిపిస్తాయి. చిన్న గింజలు ఉంటాయి. విటమిన్‌ సీ, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది.
*చెర్రీ
విజయవాడలో దిగుమతి అవుతున్న పండ్లలో చెర్రీ కూడా ఒకటి. ఇందులో కార్బొహైడ్రేట్లు, విటమిన్‌ సి, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.
*కివి:
న్యూజిలాండ్, ఇటలీ, ఇరాన్, చైనా నుంచి దిగుమతి అవుతాయి. ప్రసుత్తం దేశీయ పండ్ల కంటే విదేశీ కివీకి ఎక్కువ డిమాండ్‌ .
*ప్లమ్‌:
ఇదిచిన్న యాపిల్‌. చిన్న సైజు టమాటలా కనిపిస్తుంది. పెద్ద రేగు పండు సైజులో ఉంటుంది. కాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగి్నయంతో పాటు ఇతర పోషకాలు ఈ పండులో అధికంగా ఉన్నాయి.