ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌కు చెందిన రెనానీ జువెల్స్ అరుదైన ఘనత సాధించింది. 12,638 వజ్రాలతో ఓ ఉంగరాన్ని తయారుచేసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది.సాధారణంగా ఓ ఉంగరంలో ఎన్ని వజ్రాలు ఉంటాయి? ఒకటే కదా.. అనుకుంటున్నారా? కాదు.. 12,638. అవును మీరు చదివింది నిజమే. 12,638 వజ్రాలతో తయారు చేసిన ఓ ఉంగరం గిన్నిస్ రికార్డులకెక్కింది. ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌కు చెందిన రెనానీ జువెల్స్ సంస్థ ఈ ఉంగరాన్ని రూపొందించింది.
** వజ్రాలతో రూపకల్పనప్రత్యేకతలు..
*ఉంగరం బరువు: 165
*గ్రాములుతయారీదారు: రెనానీ జువెల్స్
*ఉంగరం పేరు: మేరీ గోల్డ్, ద రింగ్ ఆఫ్ ప్రాస్పరిటీ 38.08 క్యారెట్ల మేలిమి వజ్రాలతో ఉంగరం తయారీ
****మునుపటి రికార్డ్..
హైదరాబాద్‌కు చెందిన హాల్‌మార్క్ జువెలర్స్ 7,801 వజ్రాలతో తయారు చేసిన ఉంగరం పేరిట ఈ ఘనత ఉండేది. అత్యధిక వజ్రాల ఉంగరంగా ఆ రికార్డ్‌ను రెనానీ జువెల్స్ అధిగమించింది.గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం ఆనందంగా ఉందని రెనానీ జువెల్స్ అధిపతి హర్షిత్ బన్సాల్ తెలిపారు. ఈ ఉంగరం చేయడానికి దాదాపు రెండు ఏళ్లు పట్టిందని చెప్పారు.
హైదరాబాద్ వజ్రాల రికార్డు దాటిన యూపీ ఉంగరం
Related tags :