DailyDose

900 అక్రమ మద్యం సీసాలు పట్టివేత-నేరవార్తలు

900 అక్రమ మద్యం సీసాలు పట్టివేత-నేరవార్తలు

* జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు సమీపంలో భారీగా తెలంగాణ అక్రమ మద్యం పట్టివేత.సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 900 క్వాటర్ బాటిళ్లు, 100 పుల్ బాటిళ్లు స్వాధీనం.

* తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన తడుకుపేట సమీపంలో కాశీ హోటల్ దగ్గర తమిళనాడు ఆర్టీసీ బస్ బోల్తా.

* రామతీర్థంలో చోటుచేసుకున్న విగ్రహ ద్వంసం ఘటనను ఖండిస్తూ. బీజేపీ, జనసేన సంయుక్తంగా చేపట్టిన రామతీర్థ ధర్మాయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరును జనసేనపార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

* రామతీర్థం ఘటనపై దర్యాప్తుకు సీబీసీఐడి అధికారి సునీల్ కుమార్‌కు అప్పజెప్పటంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు.

* యుద్ధానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు.

* ఏలూరు జిల్లాలోని ఆచంట మండలం భీమలాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నరేష్ అనే వ్యక్తి ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.