భోజనం చేశాక కొద్దిగా సోంపు నోట్లో వేసుకుంటాం. మౌత్ ఫ్రెష్‌నర్‌గానే కాదు రక్తహీనత, మూత్రనాళ సంబంధ వ్యాధుల్ని దూరం చేసే మందుగానూ సోంపు పనిచేస్తుంది. రోజూ కొద్దిగా సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివి. సోంపు నమలడం ద్వారా లాలాజలంలో నైట్రేట్ నిల్వలు పెరుగుతాయి. నైట్రేట్ రక్తపీడనంలో హెచ్చుతగ్గులు రాకుండా చూస్తుంది.వీటిలోని పొటాషియం శరీర ద్రవాల్లో ముఖ్య పదార్థం. ఇది రక్తపీడనాన్ని అదుపులో ఉంచి గుండె కొట్టుకొనే వేగాన్ని నియంత్రిస్తుంది.సోంపు టీ డైయురెటిక్‌గా పనిచేస్తుంది. రోజూ సోంపు టీ తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. దాంతో మూత్రనాళ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది.దీనిలోని ఫైటోఈస్ట్రోజన్‌గా అనెథోల్ బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది.అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌ల విడుదలను ప్రేరేపించి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.వీటిలోని ఫైటోన్యూట్రియెంట్స్ ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధ జబ్బుల్ని నివారిస్తాయి.రోజూ సోంపు తినడం వల్ల శరీరానికి అవసరమైన జింక్, కాల్షియం, సెలీనియం వంటి మినరల్స్ లభిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. జింక్, కాల్షియం, సెలీనియం హార్మోన్, ఆక్సిజన్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.సోంపును నీళ్లలో వేసి కొద్దిసేపు మరిగించి, ఆ ద్రావణాన్ని మౌత్‌వా్‌షగా ఉపయోగించొచ్చు.దీనిలోని యాంటీ ఆక్సిండెంట్లు ఫ్రీరాడికల్స్‌ను తొలగించి చర్మ, రొమ్ము కేన్సర్ ముప్పును తప్పిస్తాయి.సోంపులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.వీటిలోని ఐరన్, ఫోలిక్ ఆమ్లం మహిళల్లో రక్తహీనతను నివారిస్తాయి. అంతేకాదు నెలసరి సమయంలో సాధారణంగా కనిపించే వికారాన్ని తగ్గిస్తాయి.సోంపులోని యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లను దృఢంగా చేస్తాయి. వెంట్రుకలు ఊడిపోవడాన్ని తగ్గిస్తాయి.కొన్ని రకాల వంటకాల్లో సోంపును సుగంధ ద్రవ్యంగా వాడతారు కూడా.
సోంపు నీళ్లు తాగితే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన వదులుతుంది.
బీపీని నియంత్రించే సోంఫు
Related tags :