* తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎంపిక పై మరో ట్విస్ట్ తెర పైకి వచ్చింది.నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజు కు, హైకమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్ చేశారు.పీసీసీ గొడవ ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై పడుతుందని హస్తిన పెద్దలకు జానారెడ్డి తేల్చి చెప్పారు.ఉప ఎన్నికల ముందు ప్రకటన తో నేతల్లో ఐక్యత లోపిస్తుందని హెచ్చరించారు.జానారెడ్డి విజ్ఞప్తి తో పీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ తర్జన భర్జనలు పడుతోంది.
* మరో సారి లాక్ డౌన్ ను పొడిగించిన జర్మనీ.. జనవరి 31 వరకూ అమలు..జర్మనీ దేశంలో కరోనా వైరస్ లాక్డౌన్ విస్తరించడానికి సమాఖ్య మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి.
* పనబాక లక్ష్మి కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సంబరాలు సమీపిస్తున్న వేళా అన్ని జిల్లాల్లో కోళ్ళ పందెం కు అనుమతులు ఇస్తారా లేక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిలిపివేస్తారా అనేది వేచి చూడాల్సిందే.
* హఫీజ్‌పేట భూ వివాదం వ్యవహారం నేపథ్యంలో నమోదైన కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి కిడ్నాప్ కేసు నమోదైందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. మనోవికాస్ నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీలో ఉంటున్న ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు సోదరులను 10 మందితో కూడిన బృందం కిడ్నాప్ చేసిందన్నారు.
* రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం అండదండలున్నాయని భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం గర్హనీయమన్నారు. రామతీర్థం ఘటన, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
* బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ముగ్గురు సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ2 నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి వైద్యపరీక్షలకు తరలించగా.. తాజాగా ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఏ-1 నిందితుడిని కాదన్నారు. ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లనే పోలీసులు పేర్కొన్నారని చెప్పారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కిడ్నాప్ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. అసలు తనకు అఖిలప్రియ వ్యవహార శైలి నచ్చదన్నారు.
* ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని కోళ్లలో ఇప్పటి వరకు వైరస్ ఆనవాళ్లు కనపడలేదని చెప్పారు. వినియోగదారులు, రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం దేశంలో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
* గుంటూరు జిల్లా కొల్లిపర మండలం గుదిబండివారి పాలెంలో కాకుల మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరు కాకులు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా వచ్చిందేమో అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి ఈ ప్రాంతంలో కాకులు చనిపోతున్నాయని సమాచారం అందిందన్నారు.
* ఉన్నత హోదాల్లో లింగ వివక్షను రూపుమాపేలా జర్మనీ ప్రభుత్వం చారిత్రక చట్టం తీసుకొస్తోంది. లిస్టెడ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలు ఉండేలా రూపొందించిన బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. నూతన మూసాయిదా చట్టం ప్రకారం.. నలుగురు అంతకంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్‌లు ఉండే లిస్టెడ్ కంపెనీలు కనీసం ఒక మహిళను బోర్డు సభ్యురాలిగా నియమించాల్సి ఉంటుంది. యూరప్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో మహిళలకు ఉన్నత హోదా అనేది అంతంతమాత్రంగానే ఉంది. ఆ దేశ లిస్టెడ్ కంపెనీల్లో కేవలం 12.8శాతం మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు మాత్రమే మహిళలు.
* సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని నూరు శాతానికి పెంచేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్రం అంగీకరించలేదు. తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా నేపథ్యంలో 50 శాతం సీట్ల సామర్థ్యంతో మాత్రమే థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సంక్రాంతి పండగను దృష్ట్యా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వినతుల మేరకు నూరు శాతం సామర్థ్యం పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం తాజా అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
* ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ ఆ గ్రామాల మహిళల నిత్య జీవన విధానం. అదే మహిళలు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయచట్టాల కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాక్టర్ నడిపి తమ నిరసన తెలియజేసేందుకు రెడీ అంటున్నారు. అందుకోసం ఏనాడూ స్టీరింగ్ ఎరుగని వారంతా శిక్షణ తీసుకుని ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనేందుకు సై అంటున్నారు. గత కొన్ని రోజులుగా దిల్లీ సరిహద్దులో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో చర్చలు విఫలమైతే ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీకి ట్రాక్టర్ పరేడ్ నిర్వహించ తలపెట్టారు రైతులు.