ఈ నెలలో జరిగే యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్, టొయొటా థాయ్‌లాండ్ ఓపెన్ (19- 24)లతో అంతర్జాతీయ క్రీడాకారులంతా మళ్లీ బరిలో దిగనున్నారు. అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్ జరిగినా.. సింధు, సైనా సహా అగ్రశ్రేణి క్రీడాకారులు దూరంగా ఉన్నారు. భారత్ నుంచి కిదాంబి శ్రీకాంత్ పాల్గొన్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. స్టార్ క్రీడాకారులు దూరంగా ఉంటుండటంతో బీడబ్ల్యూఎఫ్ సైతం టోర్నీల నిర్వహణకు మొగ్గుచూపలేదు. అయితే టోక్యో ఒలింపిక్స్ సమీపిస్తుండటంతో క్వాలిఫయింగ్, ర్యాంకింగ్‌పై దృష్టిసారించింది. ఒకేసారి క్వాలిఫయింగ్ టోర్నీలు పెట్టుకుండా మొదట థాయ్‌లాండ్ టోర్నీలు నిర్వహిస్తోంది. నెల తర్వాత క్వాలిఫయింగ్ పోటీలు ప్రారంభిస్తుంది. క్రీడాకారులు తమ ఫిట్‌నెస్, నైపుణ్యంపై అంచనాకు రావడానికి రెండు టోర్నీలు.. విరామ సమయం దోహద పడతాయన్నది బీడబ్ల్యూఎఫ్ ఆలోచన.
ఈ నెలలో షటిల్ పోటీలు ప్రారంభం
Related tags :