* విశాఖ లో నేవీలో ఎంపిక కాలేదని నాల్గవ అంతస్దుప్తె నుంచి దూకీ యువకుడు ఆత్మహత్య….శ్రీహరిపురంలో ఘటన చొటుచేసుకుంది , డిల్లీకీ చెందిన వ్తెభవ్ సింగ్ (18),నేవీ లో టెక్నికల్ ఎంట్రీ సర్వీస్ (టేశ్) ఇంటర్వ్యూకు వచ్చాడు….నేవీలో ఎంపిక కాలేదని మనస్ధాపంతో శ్రీహరిపురంలోని తన పెదనాన్న వుంటున్న అపార్టుమెంట్ నాల్గవ అంతస్ధుప్తె నుంచి దూకీ మృతి…మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం కేజిహెచ్ కు తరలించి, మల్కాపురం పోలీసులు కేసు నమోదు చెసి దర్యాప్తు చేపట్టారు.
* పామూరు ఇళ్ల పట్టాల పంపిణీలో రికార్డింగ్ డాన్సులు.
* ఏవీ సుబ్బా రెడ్డి ని విడుదల చేసిన పోలీసులు.41 చ్ర్ప్చ్ నోటీసులు ఇచ్చిన పోలీసులు.విచారణకు ఎపుడు పిలిచినా రావాలని ఏవి సుబ్బా రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.
* తాము దంపతులమంటూ నెలక్రితం అద్దెకు దిగారు. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేస్తున్నట్లు యజమానికి ఫోన్‌లో చెప్పి వెళ్లిపోయాడు. తీరా వచ్చి చూస్తే ఇంటి ఆవరణలోనే మూటలో మహిళ శవం కనిపించింది. భర్తగా చెప్పుకొన్న వ్యక్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. వ్యాపారవేత్త అయిన సి.రంగస్వామికి కూకట్‌పల్లి హైదర్‌నగర్ పరిధి సత్యనారాయణ స్వామి కాలనీ (ఎస్.ఎస్.కాలనీ)లో ఓ భవన సముదాయం ఉంది. ఇందులోని మడిగెలతోపాటు గదులను అద్దెలకిస్తూ ఉపాధిని పొందుతున్నారు. గతనెల 5న ఓ జంట వచ్చింది. తాము భార్యాభర్తలమని, తమకు ఓ గది అద్దెకు కావాలని అడిగింది. తమ పేర్లు వెంకటేశ్వర్లు అలియాస్ శేఖర్, స్రవంతి (32)గా ఇంటి యజమానికి చెప్పి భవనం మొదటి అంతస్తులో ఉన్న గదిని అద్దెకు తీసుకున్నారు. ఈనెల 5న శేఖర్.. ఇంటి యజమానికి ఫోన్ చేసి తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి సామాన్లతో సహా వెళ్లిపోయాడు. అయితే ఖాళీ అయిన గదిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషి.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద మూటకట్టి ఉన్న ఓ సంచిని గమనించింది. దగ్గరికి వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి యజమానికి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి మూటను విప్పి చూడగా స్రవంతి మృతదేహం కనిపించింది. ఆమె తలపై బలమైన ఆయుధంతో కొట్టి మెడను చున్నీతో బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లు గురించి ఆరా తీయగా అతని చరవాణి పనిచేయడం లేదు. స్రవంతితో వచ్చిన వ్యక్తే చంపి పరారై ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో మృతురాలి ఆధార్ నకలు దొరికింది. అందులో మృతురాలి భర్త పేరు పాపారావుగా ఉంది. చిరునామా.. ఖమ్మం జిల్లా (ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా) ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌గా ఉంది. దీన్నిబట్టి మృతురాలు అతనికి భార్య అయి ఉండదని భావిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తనే కడతేర్చిన కేసును పోలీసులు ఛేదించారు. నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి, సోన్ సీఐ జీవన్‌రెడ్డితో కలిసి వివరాలను బుధవారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన అబ్దుల్ సమద్ ఫైసల్(44) పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య యాస్మిన్ బేగంకు అదే గ్రామానికి చెందిన మహ్మద్ అథఉల్లాతో సాన్నిహిత్యం ఏర్పడింది. విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు ఇద్దరినీ మందలించారు. మతపెద్దలకు ఫిర్యాదు చేశారు. అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న యాస్మిన్ బేగం ప్రియుడితో కలిసి ప్రణాళిక రూపొందించింది. గత నెల డిసెంబరు 16న రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన మహ్మద్, అదును చూసి కర్రతో ఫైసల్ తలపై కొట్టాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడి మెడకు తాడు బిగించి ఇద్దరూ కలిసి హత్య చేశారు. రోజంతా శవాన్ని గదిలో ఉంచారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారేస్తే ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటారని భావించి మొదట కుడికాలును కోశారు. అది తెగేందుకు గంటకు పైగా సమయం పట్టడంతో ఆలోచనను విరమించుకున్నారు. ముఖంపై కిరోసిన్‌లో ముంచిన గుడ్డను ఉంచి కాల్చారు. మృతదేహంపై ఉన్న దుస్తులపై ఎలాంటి వివరాల్లేకుండా జాగ్రత్తపడ్డారు. శవాన్ని గోనెసంచిలో చుట్టి ఆటోలో నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి శివారులోని అటవీప్రాంతంలో పడేశారు. యాస్మిన్‌బేగం ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ అక్కడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.