మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని అలరించింది. అందులో శ్రీకాంత్ తివారీగా మనోజ్ నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఒకటో సీజన్ అందించిన విజయంతో ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2ను తెరకెక్కించారు దర్శకద్వయం రాజ్, డీకే. ఇప్పుడు ఈ రెండో సీజన్‌కు అదనపు ఆకర్షణ కథానాయిక సమంత. ఆమె తొలిసారి నటిస్తున్న వెబ్‌సిరీస్ ఇది. ఇటీవలే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ప్రసార తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 12న

Related tags :