Sports

కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్

కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్

విక్రమ్‌ కథానాయకుడిగా ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని శనివారం విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ అంచనాలను పెంచుతోంది. ఇందులో విక్రమ్‌ 20 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడని కోలీవుడ్‌ టాక్‌. కాగా, ఇందులో ఇర్ఫాన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నారు. ‘కోబ్రా’లో ఇర్ఫాన్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కోల్‌కతాలో షూటింగ్‌ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘కోల్‌కతాలో ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ ఏం చేస్తున్నారు?’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.