* ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు వెంటనే గుర్తొచ్చేది వ్యక్తిగత రుణం. అది సులభంగా కూడా లభిస్తుంది. అదేవిధంగా బంగారంపై రుణాలు కూడా ఇందుకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇవి భద్రతతో కూడుకొని ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి రుణం తీసుకుంటే మంచిదా? లేదా వ్యక్తిగత రుణం తీసుకుంటే మంచిదా? అనే సందేహం కలుగుతుంటుంది మనకు. ఈ రెండు రుణాలు వేగంగానే లభ్యమవ్వడం వడ్డీ రేట్లు కూడా ఇంచుమించు ఒకే పరిధిలో ఉండటం మూలంగా చాలా మంది వినియోగదార్లు సందిగ్ధంలో పడతారు. గోల్డ్ లోన్ పై వడ్డీరేటు 9.85% – 26%, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు 10.75 – 24% వరకూ ఉంటుంది.
* దేశంలో ఓ వైపు డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నప్పటికీ కొవిడ్ నేపథ్యంలో ప్రజలు నగదును చేతిలో ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనన్న ముందు జాగ్రత్తతో నోట్లను అట్టిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఏకంగా 13 శాతం నగదు చలామణీ పెరిగినట్లు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్‌లో కొన్ని డేటా సిస్టమ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీనికి పాల్పడిన హ్యాకర్లను ఇంకా గుర్తించలేదు. కానీ, వారి చేతిలో పడ్డ సమాచారంలో కీలకమైన వాణిజ్య, వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. బ్యాంకులో కొన్ని కీలకమైన ఫైల్స్ సమాచారాన్ని పంచుకోవడానికి, భద్రపర్చడానికి ఒక థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ను వినియోగిస్తారు. హ్యాకర్లు దీనిని ఆధీనంలోకి తీసుకొని డేటా సిస్టమ్స్‌లోకి చొరబడ్డారు. ఈ విషయాన్ని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ ఒక ప్రకటనలో వెల్లడిచింది. ‘‘బ్యాంక్ ఆ దాడిని ఆపగలిగింది.. కీలక వ్యవస్థల పనితీరు దీని కారణంగా ప్రభావితం కాలేదు. మేము దేశీయ, అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కలిసి ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని గవర్నర్ అడ్రైన్ఓర్ తెలిపారు.
* అమెరికాకు చెందిన సోషల్ నెట్వర్కింగ్ యాప్ పార్లర్‌పై యాపిల్ సంస్థ చర్యలు చేపట్టింది. తమ యాప్ స్టోర్ నుంచి పార్లర్‌ను తొలగించింది. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి పార్లర్ యాప్‌ను ఉపయోగించుకొన్నారని యాపిల్ ఆరోపిస్తోంది. 24 గంటల్లోపు ఆ సంస్థ యాప్‌లో మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రణాళికతో తమ వద్దకు రావాలని యాపిల్ సూచించిన తర్వాత ఈ చర్యలు తీసుకొంది.
* సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. నిత్యావసరాల కొనుగోలు ఇకపై భారం కానుంది. ఇంట్లో నిత్యం ఉపయోగించే సబ్బులు, నూనెలు, బిస్కెట్లు, టూత్ పేస్టులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముడిసరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచేందుకు ఆయా కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
* ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు గ్లోబల్ స్టాక్సు కొనడానికి సిద్ధం అవుతోంది. గత 10 సంవత్సరాలుగా లాభాలలో అంతర్జాతీయ ఈక్విటీలు దేశీయ స్టాక్లను అధిగమించాయి.
* ఆదాయపు పన్ను శాఖ 2021 సంవత్సరానికి కొత్త ఇ-క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇది పన్నుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన గడువుల జాబితాను కలిగి ఉంది. ‘నిజాయితీపరులను గౌరవించేవిధంగా ఈ క్యాలెండర్‌గా రూపకల్పన చేశారు. పన్ను వ్యవస్థ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేని, ఫేస్‌లెస్, కాగిత రహితంగా మారిందని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను విభాగం తెలిపింది.