ఏదైనా టీకొట్టుకు వెళ్తే… అక్కడ రకరకాల టీ రుచులూ, వాటి ధరలూ కనిపించడం మామూలే. కానీ మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ‘కాలు బేవఫా చాయ్‌వాలా’ అనే టీకొట్టులో చాయ్‌పేర్లు కాస్త కొత్తగా ఉండటంతో వాటిని చూసినవాళ్లు టీలకు ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా అని అనకుండా ఉండలేకపోతున్నారు. ఎలాగంటే… ‘ప్రేమలో మోసపోయినవారి చాయ్’, ‘కొత్త ప్రేమ జంటల చాయ్’, ‘ఒంటరితనం చాయ్’… తాను అమ్మే టీలకు ఇలా రకరకాల పేర్లు పెట్టడమే కాదు అందుకు తగినట్లుగా వాటి ధరల్నీ నిర్ణయించాడు ఈ చాయ్‌వాలా. ఉదాహరణకు ప్రేమలో మోసపోయిన చాయ్ ధర అయిదు రూపాయలయితే, మనసారా ప్రేమ పొందాలనుకునే చాయ్ ధర నలభైతొమ్మిదిరూపాయలు అట. ఒకవేళ ఎవరైనా భార్యతో గొడవపడి ఈ టీ కొట్టుకు వస్తే వాళ్లకు మాత్రం ఉచితంగానే టీ ఇస్తాడట. చాయ్‌లను రకరకాల రుచుల్లో ఇచ్చే మాట ఎలా ఉన్నా… ఇలా భిన్నంగా మార్కెటింగ్ చేసుకుంటేనే కస్టమర్లు పెరుగుతారనే ఈ టీకొట్టు యజమాని ఆలోచనను ఎవరో సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ‘వాట్ యాన్ ఐడియా’ అంటూ అందరూ అతడిని తెగ పొగిడేస్తున్నారు.
భార్యతో గొడవ పడండి. టీ ఉచితంగా పొందండి.
Related tags :