ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టి ఉంటున్నారా..? లేదా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నారా..? శ్వాసక్రియలో ఇబ్బందిగా ఉందా..? వీటిలో మీకు ఏ లక్షణం ఉన్నా మీరు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లే.. ఈ మేరకు ఐఐటీ మద్రాస్ ఒక పరిశోధనలో తెలిపింది. ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ఈ పరిశోధనకు చెందిన పత్రాలు ఇటీవల ప్రచురితమయ్యాయి. శ్వాసకోశ వ్యాధులను సరైన చికిత్స చేసేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులు అందర్నీ ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఇతరులకు సంక్రమించే స్వభావాన్నే కలిగి ఉన్నాయి. అందువల్ల వీటికి గల కారణాలను మొదలు నుంచి అన్వేషించామని పరిశోధకులు తెలిపారు. మన శ్వాసక్రియలో అవకతవకల వల్ల కూడా మనం కరోనా వైరస్ బారిన పడతామని తెలుపుతున్నారు. శ్వాసక్రియ వేగాన్ని బట్టి లోపలికి చేరిన వైరస్ ప్రభావం ఉంటుందన్నారు. మనం నెమ్మదిగా శ్వాసను తీసుకొంటే వైరస్ లోపల ఉండే సమయం పెరిగి అది ఇన్ఫెక్షన్‌కు దారితీయొచ్చని తెలిపారు.
మీ శ్వాసలో కరోనా లక్షణాలు
Related tags :