‘‘దేశంలో అనేక మంది వారి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ, అందరికీ అన్నం పెట్టే రైతన్నే ఉద్యమం చేస్తే.. దేశం ఏమయిపోయింది? రైతే బంద్ చేస్తే పరిస్థితి ఏమిటి? అన్నదే నా ‘రైతు బంద్’ చిత్రంతో చూపించబోతున్నా’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఇది ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘ఏవైతే రైతులకు మేలు జరుగుతాయని కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందో.. అవి రైతులకు శాపాలు, మాకు ఉరితాడు’ అని దిల్లీలో పెద్ద ఉద్యమం జరుగుతోంది. కేంద్రం తెచ్చిన ఈ మూడు చట్టాల వల్ల దేశంలో వ్యవసాయం అంతా కార్పొరేట్ మయమైపోతుంది. ఫలితంగా రైతులు నష్టపోతారు. కేంద్రం తెచ్చిన ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారస్సులను అమలు చెయ్యాలి. ఇదే విషయాన్ని ‘రైతు బంద్’ చిత్రంతో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు.
“రైతు బంద్”
Related tags :