మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ‘శభాష్ మిథు’ అనే చిత్రం తెరకెక్కనుంది. తాప్సీ టైటిల్ రోల్‌లో కనిపిస్తారు. ‘ఈ సినిమా చేయడం నా అదృష్టంలా భావిస్తున్నాను’ అన్నారు తాప్సీ. ‘శభాష్ మిథు’ చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘ఈ సినిమా చేయడంలో రెండు రకాల సవాళ్లు ఉన్నాయి. మొదటిది క్రికెట్. నాకు క్రికెట్ ఆడటం రాదు. ప్రొఫెషనల్ ప్లేయర్‌లా ఆడటం నేర్చుకోవాలి. రెండవది మిథాలీ రాజ్‌లా స్క్రీన్ మీద కనిపించాలి. మిథాలీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం పూర్తిగా భిన్నమైనవి. ఆమె చాలా నెమ్మదస్తురాలు. ఏ మాట అయినా ఆమె ఆలోచించే మాట్లాడతారు. నేను అందుకు పూర్తి విరుద్ధం. మహిళా క్రికెట్‌లో మిథాలీ ఒక ఐకాన్. ఆమె పాత్రను స్క్రీన్ మీద పోషించే అవకాశం రావడం అదృష్టం. కేవలం క్రీడాకారిణిగానే కాదు.. ఒక వ్యక్తిగా మిథాలీ అంటే నాకెంతో గౌరవం’’ అన్నారు తాప్సీ. ‘స్పోర్ట్స్ పర్సన్‌గా నటించడానికి మీ బాయ్‌ఫ్రెండ్ (మాథ్యూస్ బో, బ్యాడ్మింటన్ ప్లేయర్) నుంచి ఏదైనా టిప్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు– ‘‘మెదడు ఆపరేషన్ చేసేవాళ్లు, హృదయానికి సంబంధించిన వాళ్లు ఏం చేయాలో చెప్పకూడదు కదా. రెండూ వేరు వేరు స్పోర్ట్స్. అలానే పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను విడివిడిగా ఉంచడానికి ఇష్టపడతాం’’ అని సమాధానమిచ్చారు.
మిథు అదృష్టం
Related tags :