అమెరికా క్యాపిటల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనను గడవుకు ముందే పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్‌లు ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు ట్రంప్ మంత్రివర్గమే ఆయనపై అభిశంసన తీర్మానంపెట్టి తొలగించేలా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు కోసం అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, డెమోక్రాట్‌ల ప్రయత్నాలను డొనాల్డ్ ట్రంప్ తేలిగ్గా తీసిపారేశారు. 25వ రాజ్యాంగ సవరణతో తనకు ఏమాత్రం రిస్క్ ఉండబోదని, పైగా కాబోయే అధ్యక్షుడు బైడెన్‌నే భవిష్యత్తులో అది వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. తనపై 25వ రాజ్యాంగ సవరణను ప్రయోగిస్తే వచ్చే నష్టమేం లేదని, కానీ జో బైడెన్‌ను మాత్రం అయన పదవిలో ఉన్నంతకాలం అది వెంటాడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు అమెరికా భవిష్యత్తుకే ప్రమాదకరమని ట్రంప్ హెచ్చరించారు. అధ్యక్షుడిపై 25వ సవరణ ప్రయోగం దేశంలో అస్థిరతకు దారితీస్తుందన్నారు. కాగా, ట్రంప్ రెచ్చగొట్టడంవల్లే ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడిచేశారని, అందువల్ల జనవరి 19న ఆయన పదవీకాలం ముగియడానికి ముందే అవమానకరంగా పదవి నుంచి తొలగించాలని డెమోక్రాట్‌లు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పై విధంగా స్పందించారు.
నాకు రవ్వంత బెరుకు లేదు
Related tags :