మరోవారం రోజుల్లో అధికారానికి దూరం కానున్న అమెరికా అధ్యక్షుడు అభిశంసనకు గురయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. జోబైడెన్ గెలుపును ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ కావాలనే తన మద్దతుదారులను ప్రోత్సహించారని పేర్కొంటూ డెమొక్రాట్లు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పెట్టారు. దీనికి మెజారిటీ సభ్యులు మద్దతు ఇవ్వడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఈ తీర్మానాన్ని సెనెట్‌కు పంపనున్నారు. జనవరి 20న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం ట్రంప్‌పై విచారణ జరగనుంది.
ట్రంప్ అభిశంసనకు హౌజ్ ఆమోదం
Related tags :