DailyDose

గాలిపటం కారణంగా మహిళ మృతి-నేరవార్తలు

గాలిపటం కారణంగా మహిళ మృతి-నేరవార్తలు

* జనగామలో పతంగి ఎగరేసుకుంటూ వెనక్కి వెళ్లి.. బిల్డింగు పైనుండి కింద పడిపోయిన మహిళ.

* నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ పరిధిలోని రామ్ నగర్ వద్ద ఓ మోటార్ బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు.. బైక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలాజీ నగర్ ఎస్ఐ అంకమ్మ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

* మీడియా సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ …- ఆలయాలపై దాడులంటూ దుష్ప్రచారం జరుగుతోంది.- ఆలయాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.- కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.- గతేడాదిలో పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి.- కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారు.- ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారు.- కరోనాతో 109 మంది పోలీసులు మరణించారు.- టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కుపైగా అవార్డులు వచ్చాయి.- రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదు.- ఈ మధ్య కాలంలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.

* హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు.. కూకట్‌పల్లిలో కంపించిన భూమి. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పండగ పూట కావడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. ఇవాళ ఉదయం తొమ్మిదన్నర ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

* తెలంగాణ లో కొత్తగా 331 కొవిడ్‌ కేసులు నమోదు కాగా మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,90,640 కి, మృతుల సంఖ్య 1,571 (0.54%)బీకి పెరిగింది. కరోనా బారిన పడి తాజాగా 394 మంది కోలుకోగా మొత్తంగా ఇప్పటి వరకూ 2,84,611 మంది ఆరోగ్య వంతులయ్యారు. ఈ నెల 12 న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారిన పడి ప్రస్తుతం 4,458 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.