సంక్రాంతి రోజు నువ్వులు, బెల్లంతో తయారుచేసిన లడ్డూలను తింటారు. బంధువులకు పంచుతారు. ఎన్ని కష్టాలు, విభేదాలు వచ్చినా సరే అందరూ నువ్వులు, బెల్లంలా కలిసిమెలసి ఉండాలని చెప్పడం ఈ లడ్డూలను ఇచ్చిపుచ్చుకోవడం వెనకున్న ఉద్దేశం.అలానే సంక్రాంతి సమయంలో పిల్లలు గాలి పటాలు ఎగురవేస్తారు. అందుకు కారణం సంక్రాంతి ప్రారంభంతో రోజులో పగలు ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో చాలా సమయం ఇంట్లోనే ఉన్నవాళ్లు ఎండలో స్నేహితులతో కలిసి రంగు రంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏటా ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ జరుగుతుంది. అక్కడికి పతంగులు ఎగరేయడానికి దేశ నలుమూలల నుంచే కాకుండా వీదేశాల నుంచి కూడా చాలామంది వస్తారు.బిహార్, జార్ఘండ్లో సంక్రాంతిని రెండు రోజులు జరుపుకొంటారు. మొదటి రోజు చెరువు లేదా నదిలో స్నానం చేసి ‘తిల్గుడ్’ (నువ్వుల లడ్డూ) తింటారు. రెండో రోజు కాలీఫ్లవర్, బఠాణి,బంగాళదుంపతో చేసిన కిచిడీ ఆరగిస్తారు.‘నువ్వుల లడ్డూ తినండి. మంచి మాటలు పలకండి’ అంటూ మహారాష్ట్రలో నువ్వుల లడ్డూలు తినిపించుకుంటారు.పంజాబ్లో ‘లోహ్రి’ తరువాతి రోజు ‘మాఘీ’ అంటే రైతులకు కొత్త ఆర్థిక సంవత్సరంగా భావిస్తారు.తమిళ ప్రజలకు సంక్రాంతి నాలుగు రోజుల పండుగ. సంక్రాంతి రోజున అన్నం, పాలు, బెల్లం, చక్కెర, జీడిపప్పుతో తయారుచేసిన స్వీటు ఆరగిస్తారు. మూడో రోజు పశువులకు మేత తినిపిస్తారు. కొన్ని చోట్ల జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు.
గాలిపటాల సరదా వెనుక కథ ఇది
Related tags :