తిరువూరు పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు, కోతముక్క వంటివి గత రెండు రోజులుగా జోరుగా సాగుతున్నాయి. తిరువూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాలు అయిన కాకర్ల, మల్లేల, ముష్టికుంట్ల, మునుకుళ్ల తదితర గ్రామాల్లోనూ జోరుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. అధికార వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఈ పందేలు భారీగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయిలు ఈ పోటీల్లో చేతులు మారుతున్నాయి. పందేల్లో భాగంగా కోతముక్క వంటి జూదాలను సైతం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణా నుండి కూడా వేలాది మంది ఈ సంక్రాంతి పందేల్లో పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్నారు.
తిరువురు ప్రాంతంలో జోరుగా కోడిపందేలు
Related tags :