ScienceAndTech

ఇది తెలంగాణా టెస్లా

ఇది తెలంగాణా టెస్లా

సౌర విద్యుత్తుతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన బాల శివకుమార్‌(14). 9వ తరగతి చదువుతున్నాడు. సైకిల్‌కు వెనకాల సౌరపలకను అమర్చి రెండు బ్యాటరీలు ఏర్పాటు చేశాడు. విద్యుత్తును బ్యాటరీల ద్వారా మోటారుకు అనుసంధానించాడు. సైకిల్‌ హ్యాండిల్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టార్ట్‌ బటన్‌ నొక్కగానే సైకిల్‌ ముందు భాగంలోని ఫ్రీవీల్‌ చక్రానికి అనుసంధానించిన మోటారు తిరిగి సైకిల్‌ ముందుకు కదులుతుంది. హ్యాండిల్‌ కుడి చేతి వద్ద ఎక్స్‌లేటర్‌ను ఏర్పాటు చేశారు. సైకిల్‌పై 10 కి.మీ వరకు వెళ్లవచ్చని దీనికి రూ.5,100 ఖర్చయినట్లు శివకుమార్‌ తెలిపారు.