Movies

ఎవరు, ఎక్కడ, ఎందుకు?

ఎవరు, ఎక్కడ, ఎందుకు?

థ్రిల్లర్‌ సినిమాల నిపుణుడు కె.వి.గుహన్‌ దర్శకత్వంలో మరో క్రైమ్‌థ్రిల్లర్‌ చిత్రం రాబోతోంది. కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘118’తో తెరకెక్కించి సత్తా నిరూపించుకున్నారాయన. ఈసారి సైబర్‌క్రైమ్‌ ఆధారంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ(ఎవరు, ఎక్కడ, ఎందుకు) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తాజాగా విడుదల చేశారు. టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.