అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడిగా భువనేశ్ బుజాల పదవి బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీకి చెందిన భువనేశ్ 2004 నుంచి ఆటాలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్‌కు సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించిన భువనేశ్ టెన్నిస్సీ రాష్ట్రం నాష్‌విల్‌లో శుక్రవారం నాడు జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో బాధ్యతలు చేపట్టారు.
సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారిగా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రేషరేర్ గా విజయ్ కుందూరు, తదుపరి ప్రెసిడెంట్ గా మధు బొమ్మినేని, ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ గా జయంత్ చల్ల, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హను తిరుమల రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి. రామ్ అన్నాది, రవీందర్ గూడూరు, రిండా సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తుపల్లి ఎన్నికయ్యారు.
భువనేశ్ మాట్లాడుతూ ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్ అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నామని, ఆపదలో ఉన్న తెలుగు వారు ATA సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయవచ్చునని, ATA ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా పెద్దపీఠ వేస్తుందని, మాతృభూమిలో సేవ కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. సంస్థ నిర్వహణలో ప్రవాస యువతీయువకులను భాగస్వామ్యం చేసేందుకు సలహాలు సూచనలు అందజేయవల్సిందిగా బోర్డుని కోరారు. ATA కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1-3 తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కోవిద్ సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవి విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, నాష్6విల్ ఆటా బృందానికి ధన్యవాదాలు తెలిపారు.