* కడపలో ఓ మహిళా హోం గార్డు ఆత్మహత్యా యత్నం…నగరంలో ఒ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణమ్మ…హోంగార్డు ఆర్ ఐ వేధింపులు భరించలేక మనస్తాపం..మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం..స్పందించి వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు…హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు…విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్న పోలీసులు.
* లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 20మంది ప్రయాణికులతో వనపర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది.మార్గం మధ్యలో తిమ్మాపూర్ చౌరస్తా వద్ద ముందు వెళుతున్న లారీ అకస్మాత్తుగా ఆగడంతో బస్సు దాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* తమిళనాడులో ట్రక్కు ఢీకొన్న 40ఏళ్ల ఏనుగు మృతి.తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 40 ఏళ్ల ఏనుగు ఆదివారం ఉదయం మరణించింది.రోడ్డు దాటుతుండగా ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఏనుగును ఢీకొంది. ఈ ఘటనలో ఏనుగు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి.ట్రక్కు డ్రైవర్‌పై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
* గుంతకల్లు పట్టణ శివారులోని బళ్ళారి రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.కొనగండ్ల సమీపంలో 18 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ఘటనలో వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామానికి చెందిన రమణమ్మ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మంది గాయపడ్డారు.వారిలో నలుగురు బావమ్మ, లక్ష్మిదేవి, నాగవేణి, సుమ తీవ్రంగా గాయపడ్డారు.వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.