ScienceAndTech

ఆ ప్లాస్టిక్ తిరిగి భక్షిస్తున్నది మనిషే!

ఆ ప్లాస్టిక్ తిరిగి భక్షిస్తున్నది మనిషే!

ప్లాస్టిక్‌ పర్యావరణానికీ మన ఆరోగ్యానికీ కూడా హానికరం అని తెలిసినా వాడుతూనే ఉన్నాం. పైగా ఆ చెత్తను సముద్రాల్లోకీ నదుల్లోకీ వదిలేస్తుంటారు చాలామంది. విచిత్రం ఏంటంటే… అది చివరికి మళ్లీ మన శరీరంలోకే చేరిపోతోంది. హల్‌ యార్క్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం సూక్ష్మంగా ఉండే ప్లాస్టిక్‌ ముక్కలు చేపల్లో గ్రాముకి 0-2.9, మొలస్క్‌లలో 0-10.5, పీతలూ రొయ్యల్లో 1-8.6 ఉంటున్నాయట. ఆసియాఖండంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని మొలస్క్‌లలోనే ఈ మైక్రో ప్లాస్టిక్‌ ముక్కలు అత్యధికంగా ఉన్నాయని హల్‌ యూనివర్సిటీ విశ్లేషకుల మాట. అంటే మనం ఏముందిలే అని ప్లాస్టిక్‌ని వాడేయడం, నీటిలో వదిలేయడం చేస్తుంటే అవి సముద్ర జీవుల శరీరాల్లోకి చేరుతున్నాయి. తిరిగి సీ ఫుడ్‌ ద్వారా ఆ చెత్త మళ్లీ మన పొట్టలోకే వస్తోందన్నమాట.