* దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బీఎస్6 మోడల్ కార్లపై అత్యధికంగా రూ.3.06లక్షల వరకు ఇవ్వనుంది. ఆల్‌న్యూ థార్ కాకుండా మిగిలిన వాటిపై ఇది వర్తించనుంది. వీటిల్లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజి బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఇతర ఆఫర్లు కూడా వీటిలోనే కలిసి ఉంటాయి. జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు లభిస్తాయి. మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఆల్టురస్ జీ4 మోడల్‌పై అత్యధికంగా రూ.2.20లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేలు ఎక్స్‌ఛేంజి బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.16వేలు, ఇతర లబ్ధిలు రూ.20 వేల వరకు లభిస్తాయి. స్కార్పియోపై రూ.39,502 వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. వీటిల్లో రూ.10,002 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌ఛేంజి ఆఫర్, రూ.4,500 కార్పొరేట్ డిస్కౌంట్, అదనపు ఆఫర్ల కింద మరో రూ.10వేలు ఇవ్వనున్నారు. కేయూవీ 100 నెక్స్ట్‌పై రూ.62,055 తగ్గింపు వర్తిస్తుంది. ఎక్స్‌యూవీ 500పై రూ.59వేల లబ్ధిపొందవచ్చు. ది మర్రాజో ఎంపీవీపై రూ.36వేలు, బొలేరోపై రూ.24వేల తగ్గింపులు వర్తిస్తాయి.
* సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది.రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు ఆది, సోమవారాల్లో మెుత్తం 2,494 ప్రత్యేక సర్వీసులను నడపనుంది.ఈ రెండురోజుల్లో కేవలం హైదరాబాద్ కు 631 బస్సులు వేశారు.ఆదివారం హైదరాబాద్ కు 359, వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 59, విశాఖకు 125, బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులను అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.సోమవారం కూడా మెుత్తం 540 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.ఆయా మార్గాల్లో రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) బ్రహ్మనందరెడ్డి తెలిపారు.మంగళ , బుధవారాల్లో అవసరమైతే అదనపు బస్సులు కొనసాగిస్తామని చెప్పారు.
* ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం నుంచి ఐపీవోకు బిడ్లను స్వీకరించనుంది. ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) రూ.4,633 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చింది. జనవరి 18వ తేదీ నుంచి దీనికి సంబంధించిల్ బిడ్ల స్వీకరణ మొదలవుతుంది. ఒక్కో షేరు ధర రూ.25-రూ.26 మధ్య ఉండవచ్చు. దీనికి సంబంధించి యాంకర్ ఇన్వెస్టర్లకు 15వ తేదీ నుంచే బుకింగ్స్ మొదలుపెట్టింది. శుక్రవారం నాటికి రూ.1,398 కోట్లను సేకరించినట్లు సమాచారం. ప్రభుత్వ రంగానికి చెందిన ఒక ఎన్‌బీఎఫ్‌సీ ఐపీవోకు రావడం ఇదే తొలిసారి. లిస్టింగ్‌కు వచ్చిన ఐదో రైల్వే కంపెనీ ఇదే. ఈ ఆఫర్‌లో 50శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్లకు రిజర్వు చేశారు. 15శాతం నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. మిగిలిన 35శాతం వాటాలను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు.
* జనవరి 25 తర్వాత నుంచి సింగపూర్‌కు వచ్చే ప్రతి ఒక్కరు కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పటి వరకు సింగపూర్‌లో ఉండే నాన్‌రెసిడెంట్స్, యాత్రికులు మాత్రం ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ చేయించుకోవాలి. తర్వాత కొన్నాళ్లు ఇంట్లోనే ఉండి..తర్వాత సాధారణ ప్రజల్లో కలవడానికి మరోసారి పరీక్ష చేయించుకోవాలి.
* జనవరి 20వ తేదీన ప్రారంభమయ్యే ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ జనవరి 23న ముగుస్తుంది. అయితే, ప్రైమ్ చందాదారులకు ఒక్క రోజు ముందే అంటే.. 19వ తేదీనే ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసే వస్తువులపై పదిశాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎకో స్మార్ట్ స్పీకర్స్, ఫైర్ టీవీ స్టిక్ డివైజ్‌లపై అమెజాన్ 40శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. రెడ్‌మీ 9ఏ ధర ₹9,499 ఉండగా.. ₹6,499కే లభించనుంది. టీవీ, వాషింగ్‌మిషన్ తదితర హోం అప్లియన్సెస్‌పై 60శాతం వరకు రాయితీ ఉంది.